రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టెట్ ఫీజు వెంటనే తగ్గించాలి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) -2024 కి సంబంధించిన పీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్ధులకు అన్యాయం చేయడమే అన్నారు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ కు ఈనెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగులపైన పీజుభారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు 2021లో 200, 2022 లో 300, 2023 గతేడాది 2 పేపర్లకు కలిపి రూ.400 ఫీజు నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో ఒక పేపర్ కు దరఖాస్తు చేసుకంటే రూ. వెయ్యి. రెండు పేపర్లకు రూ.2వేలు చెల్లించాల్సి వస్తుంది. ఒకేసారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్ధులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందికి గురవుతారని ప్రభుత్వం నిరుద్యోగులపైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేసేటటువంటి వైఖరి సరికాదని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోవు అనడానికి నిదర్శనం ఇదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేడు అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు. ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా ప్రజా ప్రభుత్వమంటే.. ఫీజుల పెంచడం, నిరుద్యోగులపై భారం మోపడమేనా..? ఫీజులను 150-300శాతం పెంచడమేనా? టెట్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలి, పెంచిన ఫీజులను తగ్గించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నాడు. లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. ఈ ఉద్యమంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పుడు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఈ కార్యక్రమం ఏబీవీపీ sfd జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు అక్షయ్ కృష్ణ రాఘవేంద్ర సాయి పాల్గొన్నారు