జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో సాహితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గార్దియన్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలకు హాజరైన 100 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ డబ్బు లేనిది అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేని నేటి సమాజంలో తక్కువ ఫీజులతో, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ సమాజ సేవ చేస్తున్న గార్డియన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ నూతన పోకడలకు హంగులు ఆర్భాటాలకు వెళ్లి అనవసరమైన వృధా ఖర్చులు చేస్తూ ఆర్థికంగా నష్టపోవద్దని ఇటువంటి సేవ దృక్పథంతో నడుస్తున్న సంస్థలలో చేరి మంచి వసతులు పొందాలని తెలిపారు. ఆఫీస్ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు ఐనా పాఠశాలకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. మొదటిసారిగా పాఠశాలకు విచ్చేసిన మండల విద్యాధికారిని ఫౌండేషన్ కోఆర్డినేటర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహితి ఫౌండేషన్ కోఆర్డినేటర్ మహమ్మద్ అంకూస్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు..