కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా వెంకటేశ్ దోత్రే సోమవారం తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.