ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆమేను ఆహ్వానించారు, ఈ మేరకు ఓగ్గు రజిత యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తున్న పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ లో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు గెలుపు కోసం పార్టీ అబివృద్ధి కోసం పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అద్యక్షురాలు కామిని వనిత, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు రోహిణి, ప్రధాన కార్యదర్శి బుర్కా జ్యోతి, గన్న శోభా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట ఆంజనేయులు గౌడ్, బుచ్చి లింగ్ సంతోష్ గౌడ్, గుర్రం రాములు , అంతేర్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు