Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAశాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు,01 కార్,01 ఆటో స్వాధీనం.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో బుధవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు ప్రజల రక్షణ గురించి ప్రజలలో ఆభద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈసందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 47 ద్విచక్ర వాహనాలు,01 కార్,01 ఆటో సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.అదేవిధంగా గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారి మీద కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో, నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం తరుచుగా నిర్వహిస్తామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ లు శశిధర్ రెడ్డి, సదన్ కుమార్ ఎస్.ఐ లు రమాకాంత్, వేకటేశ్వర్లు, మహేష్, నవత, మల్లేశం , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments