రేకుర్తి లోని వరుణ్ మోటార్స్ షో రూం లో మారుతి కంపనీ రూపొందించిన ఆల్ న్యూ డిజైర్ కారు ను డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ పురుషోత్తం, స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవి తో కలిసి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవిష్కరించి వినియోగదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అధునాతన జెట్ సిరీస్ ఇంజన్ తో భారత దేశపు అత్యంత ఇంధన సమర్థమంతమైన సెడాన్ కార్ గా మిరుమిట్లు గొలిపే న్యూ డిజైర్ కారును స్వంతం చేసుకుంటే ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఆరు ఎయిర్ బ్యాగులతో మరియు సన్ రూఫ్ తో ఎకానమీ రేట్లలో లభించడం కస్టమర్లకు లాభదాయకం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నవీన్ రెడ్డి, సెల్స్ మేనేజర్ ప్రసాద్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.



