హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తు భవనంలో ఈరోజు మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు.
కాగా ఈ ప్రమాదంపై వెంట నే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఇంకా భవనం లోపల, పార్కింగ్, స్టోర్ రూం నుండి పొగలు వస్తున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా భవనం ఓనర్స్ పార్కింగ్ను స్టోర్ రూమ్గా వాడుతున్నారు. అందువల్లనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికా రులు చెబుతున్నారు. మొత్తానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు వెల్లడించారు