Tuesday, October 20, 2026
spot_img
HomeTELANGANAబండి సంజయ్ కలిసిన గౌడ సంఘ సభ్యులు

బండి సంజయ్ కలిసిన గౌడ సంఘ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ కులస్తులూ చందుపట్ల లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి కొత్తగా నిర్మించే ఎల్లమ్మ టెంపుల్ కు సహాయం చేయాలని నిధులు సమకూర్చాలని కోరారు. మహిమ గల పురాతన ఎల్లమ్మ గుడి శిదిలావస్థలో ఉండడాన్ని గమనించి ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం సభ్యులు 218 మంది తలా 30 వేల రూపాయలు జమ చేసుకొని కొత్తగా రాతి ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించడానికి సిద్దమై సుమారు రెండు కోట్ల రూపాయలకు నిర్మాణ వ్యయం పెరగడంతో గుడి నిర్మాణం కాంపౌండ్ గాను 20 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి కోరారు. బండి సంజయ్ కుమార్ స్పందించి త్వరలోనే నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు గంట బాలకృష్ణ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్, గౌడ సంఘం ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు గంట దేవయ్య గౌడ్, ఉపాధ్యక్షులు చింతకింది కిషన్ గౌడ్, పందిర్ల సత్తయ్య గౌడ్, గంట అంజయ్య గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి, చింతకింది దేవయ్య గౌడ్, నాగుల ఎల్లయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments