రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జడ్పీటీసీ పార్టీ కార్యాలయంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ వర్ధంతి సందర్భంగా BRS పార్టీ నాయకులు కార్యకర్తలు సాయి చంద్ కు జోహార్ సాయి చంద్ అని నినాదాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఇటు గాయకుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని బిఆర్ఎస్ పార్టీకి అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు సింగల్ విండో చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎంపీటీసీ ఎనగందుల నర్సింలు, అందె సుభాష్, పందిర్ల పరశురాం గౌడ్, హుస్సేన్, ఎంపీటీసీ మధు, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.