రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం పార్టీ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 ప్రశ్నలను సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు పూర్తయినప్పటికీ ఇంకా మాకు హామీలు నెరవేర్చడానికి నాలుగున్నర సంవత్సరాల కాలం ఉందన్నారు. మేము మిమ్ములను ప్రశ్నించాలంటే టిఆర్ఎస్ పార్టీ ఆడిన వేయి అబద్దాలను కరపత్ర రూపకంగా ప్రజల ముందు పంచుతామన్నారు. మీరు చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చేసిన దందాలు మోసాలు అన్ని బయటకు వస్తాయని ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన గతి గత పది సంవత్సరాల నుండి మీరు చేసిన మోసాలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏలూరి రాజయ్య సోషల్ మీడియా కన్వీనర్ బి పేట రాజు పాల్గొన్నారు.