ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి కార్ఖానా దర్గా లాల సహా గ్రౌండ్ జామ మసీద్ లో డాక్టర్ గొల్లపూడి అమర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బ్రేస్ డెంటల్ శిబిరాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఉచిత సేవ చేయడం చాలా గొప్ప విషయం అని డాక్టర్ అమర్ ప్రసాద్ ని అభినందించారు, రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని ఇలాంటి శిబిరాలు ఏర్పాటుచేసి పేద ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. ఈ ఉచిత డెంటల్ శిబిరంలో ఇక్కడున్న ప్రజలు వైద్యాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం జామ మసీదులో దర్గా దర్శించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కార్ఖానా ప్రెసిడెంట్ మీర్జా గౌస్, హైమద్, రషీద్ ఖాన్, సయ్యద్ ఇఫ్తాకారుద్దీన్, మహమ్మద్ ఆరోన్, మహమ్మద్ జావిద్, మొహమ్మద్ అజార్, మహమ్మద్ నవాబ్, ఆరిఫ్ కాద్రి, మహమ్మద్ కరీం, సయ్యద్ మజార్, మహమ్మద్ రహీం తదితరులు పాల్గొన్నారు