పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అదిలాబాదు పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున శుక్రవారం వాంకిడి మండల సీనియర్ నాయకుడు గుర్నులే నారాయణ ఆధ్వర్యంలో నాయకులు దుర్గం జీవన్ పాండు తదితరులు సరండి గ్రామపంచాయతీ గ్రామంలో ప్రచారంలో భాగంగా గడపగడపకు ఇంటింటికి జోరుగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరణ ఇస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థి సుగుణను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎస్సి మాదిగ కాలనీ వాసులు ఐనటువంటి ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చిందని అలాంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తుందని తెలిపారు. తిరిగి మల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి కూలీలకు ప్రతి ఒక్కరికి 400 రూపాయల దినసరి కూలీని పెంచేందుకు రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500 కే వంట గ్యాస్, పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తుందని చేసిందన్నారు.