Central Equipment Identity Register App ద్వారా పదిహేను రోజుల క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు. బొప్పపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనునతడు తేదీ 29.05.2024 రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ బొప్పాపూర్ గ్రామంలో పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా, సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని తిరిగి పిరోజ్ కు ఎల్లారెడ్డిపేట యస్.ఐ.రమాకాంత్ అందించారు. ఇకనుండి ఎవరు సెల్ఫోన్ అయినా మిస్సయినచో వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన, లేదా వారు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట యస్.ఐ తెలిపారు