రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంతేర్పుల ఎల్లయ్య, మాల సంక్షేమ సంఘం ప్రతినిధి గడ్డం జితేందర్ అంబేద్కర్ యువజన సంఘాల ఆద్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పిటిసి సభ్యులు చీటి లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు ఎలగందుల అనసూయ, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు చెన్ని బాబు, ఎరుపుల హనుమయ్య, బాయి రాజయ్య, శ్రీనివాస్, ఆనందం, గోపాల్, బీపేట రాజ్ కుమార్, కనకరాజు, ఎస్సి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎరుపుల దేవయ్య, ఎలగందుల దేవయ్య, బాయికాడి రాంచంద్రం, బాయికాడి రాజయ్య, తిరుపతి, ఎలగందుల బాబు, గణేష్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, మెగి నర్సయ్య, గుండాడి రాం రెడ్డి, బుచ్చిలింగ సంతోష్, గంట వెంకటేష్ గౌడ్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు వరదవెళ్ళి స్వామి గౌడ్, బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పందిళ్ళ పరుశురాములు గౌడ్, గుండాఢి వెంకట్ రెడ్డి, శివ, నర్సింహారెడ్డి, పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.