Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAఘనంగా మాజీ ప్రధాని P.V నరసింహారావు జయంతి వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని P.V నరసింహారావు జయంతి వేడుకలు

దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నర్సింహారావు అని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లన్నారు. ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో మాజీ ప్రధాని దివంగత పి. వి. నరసింహారావు 103వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జయంతోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్రంలోని స్వగ్రామం వంగర హుస్నాబాద్ ప్రాంత వాస్తవ్యుడు కావడం గర్వకారణమన్నారు. బహుభాషా కోవిదుడు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని వారు కొనియాడారు. భూసంస్కరణలలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త పీవీ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, కొమిరిశెట్టి తిరుపతి, వంగ గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, ఓగ్గు బాలరాజు యాదవ్, గుర్రం రాములు, గంట బుచ్చాగౌడు, కొత్తపల్లి దేవయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫిక్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, ద్యాగం లక్ష్మీనారాయణ, మద్దుల శ్రీపాల్ రెడ్డి, మలోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేగి నర్సయ్య, గంట అంజాగౌడ్, గోలిపెల్లి ప్రతాప్ రెడ్డి, అంతేర్పుల గోపాల్, శెట్టిపల్లి, ఉప్పుల రవి, శెట్టిపల్లి బాలయ్య వివిధ గ్రామాల గ్రామ శాఖల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments