హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి 17వ వార్డులో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు.. బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు. టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు కష్టపడి తీసుకువచ్చిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో విజయవంతంగా కొనసాగిందని నేడు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఎండి రహీం. గట్టు శీను. రాజేశం కీర్తి రాధ. రాజు. సదానందం. వార్డు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..