రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సోమవారం నిర్వహించే కూరగాయల సంత తై బజార్ వేలంపాటలు గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపిడివో స్పెషల్ ఆఫీసర్ సత్తయ్య సమక్షంలో నిర్వహించారు. వేలం పాటలలో తై బజార్ కాంట్రాక్టర్లు జవ్వాజీ రామస్వామి, దేశ్ పాండీ మల్లేశం లు పాల్గొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ 2024 నుంచి మార్చి 31 2025 వరకు తై బజార్ కూరగాయల వేలం పాటలు నిర్వహించగా 3 లక్షల 70 వేల రూపాయలకు జవాజీ రామస్వామి వేలం పాటలో దక్కించుకున్నారు. వేలం పాటల్లో ఎంసిఓ ఓజీ హేమ పంచాయతీ సెక్రెటరీ దేవరాజు, మాజీ వార్డు సభ్యులు జవ్వాజి లింగం, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.