ఆడవారు అమ్మవారి స్వరూపమని అలాంటి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతోమంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర చాలానే ఉందని అలాంటిది నోటి దురుసుతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి కౌశిక్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉటంకిస్తూ చీర, గాజులు పంపిస్తా వేసుకొని తిరగండని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్ లను అవహేళన చేసే విధంగా మాట్లాడారు రాజకీయాలు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చూసుకోవాలి తప్ప మహిళలను అచేతనులుగా చూపిస్తూ చీరే, సారే అంటూ మహిళలను అగౌరపరచడం ఎంతవరకు సమంజసము అని కౌశిక్ రెడ్డి, తీరుపై దుమ్మెత్తి పోశారు.కౌశిక్ రెడ్డి నీది నోరా లేక ఇంకేదైననా అని కౌశిక్ రెడ్డి నోటిని ఫినాయిల్ తో శుభ్రం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి నిరసనను ఘాటుగా తెలియజేశారు.
మహిళల ద్వారా రాజ్యాలే కూలిపోయాయి …
ఆడది ఆదిపరాశక్తి అని అలాంటి ఆడవారితో పెట్టుకున్న ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని అలాంటి నిన్ను కన్నది కూడా ఒక ఆడదే అని నీవు కట్టుకున్నది కూడా ఒక ఆడదానినే అని సోయి లేకుండా కేసీఆర్ పెద్ద పాలేరు లాగా పిచ్చి పట్టిన గ్రామ సింహం లాగా కౌశిక్ రెడ్డి వ్యవహరించడం హుజురాబాద్ ప్రజలకే సిగ్గుచేటని మున్సిపల్ వైస్ చైర్మన్ కౌశిక్ రెడ్డి తీరును ఎండగట్టారు. లోగడ కౌశిక్ రెడ్డి ఇలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగిన సమయంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు అనే సోయి లేకుండా నాటి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, పై కూడా పిచ్చి కూతలు కూసి మహిళా కమిషన్ ద్వారా చివాట్లు తిన్న ఇంకా సిగ్గు లేకుండా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం పై నియోజకవర్గ మహిళలు కోపోద్రిక్తులై ఉన్నారని కౌశిక్ రెడ్డి దమ్ముంటే, చీము నెత్తురు ఉంటే, నియోజకవర్గంలో అడుగుపెట్టి చూడు మా మహిళా మణుల శక్తి సామర్థ్యాలు ఏమిటో రుచి చూపిస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, సారంగం, రాము, దిడ్డి రాము, మారేపల్లి బిక్షపతి, బొంగోని వీరన్న, దేశిని సదానందం, కూతాడి రాజయ్య, మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, రావి కంటి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశీని కోటి, భోగంపాడు పీఎస్సీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, బోగంపాడు తాజా మాజీ సర్పంచ్ జిల్లెల తిరుపతిరెడ్డి, అజయ్ రాజు ఉడత వెంకటేష్, ఖలీల్, సునీల్, దేవరాజ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ సజ్జాద్ మహమ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు …