ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీ్‌సగఢ్‌కు బదిలీ చేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ చేసిన రాజీనామాలను ఆమోదించారు. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుత ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత గులాబ్‌చంద్ కటారియాను అసోం గవర్నర్‌గా, తమిళనాడు బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్-జార్ఖండ్, యూపీ బీజేపీ సీనియర్ నేతలు శివప్రతాప్ శుక్లా-హిమాచల్‌ప్రదేశ్, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య-సిక్కిం, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్‌ను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.
విశ్వభూషణ్ సహా ఆరుగురు గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. వీరిలో రమేశ్ బైస్ జార్ఖండ్ నుంచి మహారాష్ట్రకు, సుశీ అనసూయ ఉయికే-ఛత్తీ్‌సగఢ్ నుంచి మణిపూర్, ఎల్‌ఏ గణేశన్-మణిపూర్ నుంచి నాగాలాండ్, ఫగు చౌహాన్-బిహార్ నుంచి మేఘాలయ, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్-హిమాచల్ నుంచి బిహార్‌కు బదిలీ అయ్యారు. అరుణాచల్ గవర్నర్‌గా ఉన్న రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రాను లద్దాఖ్ ఎల్‌జీగా నియమించారు. కాగా, ఎక్కువ మంది గవర్నర్ల నియామకాలు రాజకీయ దృక్కోణంలోనే జరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కటారియా(78), రాధాకృష్ణన్‌ల నియామకం పూర్తిగా రాజస్థాన్, తమిళనాడు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చేసిందేనని చెబుతున్నారు.
జస్టిస్ నజీర్‌కు జగన్, చంద్రబాబు అభినందనలు
అమరావతి: రాష్ట్ర గవర్నర్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన గవర్నర్‌తో కలిసి పనిచేయడాన్ని సదావకాశంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైనందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. సమగ్రత, నిజాయితీ కలిగిన ఆయన రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ముందుంటారని, అందులో విజయం సాధించాలని ఆకాంక్షించారు.