పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తు ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని అన్నారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది అని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.