Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
ఉప్పు..కొన్ని కఠోర వాస్తవాలు..!! - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeARTICLESఉప్పు..కొన్ని కఠోర వాస్తవాలు..!!

ఉప్పు..కొన్ని కఠోర వాస్తవాలు..!!

ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా. రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు. అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు. అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది.

ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక్కగా స్ఫటికాల్లా మెరిసిపోతుంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ ఉప్పు సహజసిద్ధంగా తయారు చేసింది కాదు. ఇది కర్మాగారాల్లో తయారవుతుంది. అసలైన ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. దీన్ని ఎండలో ఎండబెడతారు. ఇందులో సహజసిద్ధమైన 72 ఖనిజ లవణాలుంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్, అయొడిన్‌లు ఉంటాయి కానీ, అవి సహజమైనవి. కృత్రిమమైనవి కావు. ఈ ఉప్పు నీళ్లలో వెంటనే కరిగిపోతుంది. శరీరంలో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. పైగా రక్తపోటును అంటే బీపీని తగ్గిస్తుంది. కండరాలు మొద్దుబారిపోవడం, తిమ్మిర్లెక్కడం, దురదలు పెట్టడం వంటివి తగ్గిపోతాయి.

రాత్రివేళల్లో పిక్కలు, అరికాళ్లలో నొప్పులు వచ్చినా, పిక్కలు బిగపట్టుకుపోయినా ఓ అరగ్లాసు నీళ్లలో ఓ చెంచాడు రాళ్ల ఉప్పు వేసి, బాగా కలిపి, ఆ నీటిని తాగండి. అయిదు నిమిషాల్లో ఆ నొప్పులు, బాధలన్నీ మటుమాయమైపోతాయి. రాళ్ల ఉప్పు వాడడం ప్రారంభించిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం మందులకు స్పందించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు సజావుగా పని చేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఇక 240/140 బీపీ ఉన్నప్పుడు కూడా రాళ్ల ఉప్పు కారణంగా అది సాధారణ స్థితిలోకి వచ్చేస్తోంది. రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. రోజూ రెండున్నర చెంచాల రాళ్ల ఉప్పును 15 గ్లాసుల నీటిలో కలిపి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా తాగితే రక్తపోటు దరిదాపులకు కూడా రాదని చాలామంది డాక్లర్లు చెబుతున్నారు.

బీపీ సాధారణ స్థితిలో ఉండాలన్నా, తలకు రక్తం సజావుగా చేరాలన్నా మిరపకాయల వాడకం, అరటి పండ్లు తినడం అనివార్యం. ఇవి రెగ్యులర్‌గా వాడేవారికి గుండె సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో సరైన పాళ్లలో సరైన ఉప్పు లేకపోతే నీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలవకపోతే, రక్తనాళాలు సజావుగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఏమాత్రం తగ్గినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తపోటు రావడం ఖాయం. అయొడైజ్డ్ ఉప్పు వల్ల శరీరంలో నీళ్లు నిలవవు. రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకూ నీళ్లు నిలుస్తాయి. శరీరం నుంచి సరిగా మూత్రం బయటికి పోవడానికి, చెమటలు పట్టడానికి రాళ్ల ఉప్పు సహకరిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments