జమ్మికుంట పట్టణంలో మంగళవారం రోజున పట్టణ ఎస్ఐ టి వివేక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గణేష్ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను ఎస్సై ఆపి వివరాలను అడగగా పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 700 గ్రాముల గంజాయి లభించినట్లు ఎస్ఐ తెలిపారు. వారిని ఎక్కడి నుండి ఈ గంజాయిని తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నించగా మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన ఎండి అక్రమ్ అనే వ్యక్తి వీరికి అమ్మినట్లు ఆ యువకులు భావండ్లపల్లి అఖిల్, పస్తం కుమార్, చాందల్య కిషోర్, వెలిషోజుల విష్ణువర్ధన్ లు పోలీసులకు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వర గంటి రవి, విలేకరులతో మాట్లాడుతూ యువత మాదకద్ర వ్యాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ నిషేధిత గంజాయి గుడుంబా లాంటి మాదక ద్రవ్యాలను అమ్మిన లేదా వాటిని ఉపయోగించిన చట్టపరంగా శిక్షించబడతారని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు..