అమరావతి: గడిచిన వారం పది రోజులుగా వైసీపీ రెండవ జాబితాపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. నేడు మరికొందరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి ప్యాలెస్‌కు రావాలంటూ కబురు అందినట్టు సమాచారం. నేడే రెండవ జాబితా విడుదలవుతుందంటూ లీకులు వస్తున్నాయి. రెండవ జాబితా విడుదలకు ముందు వైసీపీ లో షర్మిల టెన్షన్ మొదలైంది. ఇప్పటికే తాను షర్మిల వెంట నడుస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
జాబితా ప్రకటిస్తే అసంతృప్తులు జంప్ చేసే ప్రమాదం ఉందని అధినేతను సీనియర్‌లు హెచ్చరిస్తున్నారు. మూడో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్లను పెంచి ఇస్తున్నందున ఈ లోగానే ఇన్‌చార్జుల నియామకం పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. నేడు తుది జాబితా వస్తుందా లేదా? అనే దాని పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఈ జాబితా విడుదలవుతుందా? లేదా? అనేది చూడాలి.