2003 లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హాయంలో విజయనగరంలో దాదాపు 32 మంది జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాలు ప్రస్తుతం ఆక్రమణకు గురి అయ్మాయంటూ కూటమి విజయనగరం ఎమ్మెల్యే ఆదితీ గజపతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. అప్పటి చంద్రబాబు హాయంలో జర్నలిస్ట్ లకు ఇచ్చిన స్థలాలలో చాలా మంది వివిధ అవసరాలకు స్థలాలను విక్రయించుకోగా మరి కొంత మంది అలానే ఉంచారని అయితే అందులో ఏడుగురు వృత్తి రీత్యా పొరుగు జిల్లాలకు వెళ్లారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత పీఎస్ఎస్.వీ ప్రసాద్ ఎమ్మెల్యే ఆదితికి వివరించారు. ఆ ఏడింటి స్థలాలను గడచిన కొన్నాళ్ల నుంచీ అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్పపీ ప్రభుత్వాలు తమ అనూయాయులకు కట్టబెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఆ ఏడుగురు జర్నలిస్ట్ ల స్థలాలను విచారణ జరిపించి వారికే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదితీకి జర్నలిస్ట్ సంఘ నేతలైన శివ, గొట్టాపు త్రినాద్, ఎం.ఎస్.రాజు, కే.ఎన్.వై.పంతులు, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ తదితరులు వినతిపత్రం ఇచ్చారు.
జగన్ జమానాలో జర్నలిస్టుల స్థలాలు కూడా హాం…. ఫట్
RELATED ARTICLES