విచ్చలవిడిగా దోచుకుంటున్న గ్యాస్ సిబ్బంది..
భూపాలపల్లి జిల్లా గణపురంలో వంట గ్యాస్ డీలర్ ల సిబ్బంది అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. బుక్ చేసే ఐదు రోజులు దాటినా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందడంలేదు. గ్యాస్ ఎందుకు రావట్లేదు అని వినియోగదారులు ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. గ్యాస్ డీలర్ ఆఫీస్ & గోడౌన్ చుట్టూ మూడుసార్లు తిరిగినా సమాధానం చెప్పని సిబ్బంది. గ్యాస్ బిల్ రేటు 874 రూపాయలు ఉండగా మాకు బిల్లు కూడా ఇవ్వడం లేదు, సిలిండర్ కు 950 &1050 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. సబ్సిడీ గురించి ప్రశ్నిస్తే అకౌంట్ లో పడుతుంది అని డెలివరీ బాయ్ చెప్తున్నాడు. ఇది ఇలా ఉండగా మాకు గ్యాస్ మూడు నెలలు వచ్చేది రెండు నెలల వస్తుంది. ఎందుకు అని డెలివరీ అడగగా నాకు తెలియదు నేను కొత్తగా వచ్చాను అని చెప్తున్నారు. నాకు బరువు జోకి ఇవ్వడం లేదు మరియు డీలరు బాయ్ కి యూనిఫాం లేదు ఐడీ కార్డు లేదు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గణపురంలో గ్యాస్ గోదాం ఉండగా బంకు పక్కన 30 నుంచి 40 సిలిండర్లు అక్కడ దిగుమతి చేసి అక్కడి నుండి గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ తీస్తున్నారని అనుమానాలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. ఎందుకు గోదాం ఉండగా అక్కడ దింపుతున్నారు. అని అక్కడికి వెళ్లి అడగగా గోదం దగ్గర ఎవరు లేరని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా మాములుగా HP గ్యాస్ ఏజెన్సీ వారు 890 & 900 తీసుకుంటున్నారు. వాళ్లు 20 కిలోమీటర్ల నుండి వచ్చి బిల్లుతో సహా వేస్తున్నారు మరి మన గణపురం భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు ఎందుకు వేయడం లేదు. ఉదాహరణ రోజుకు 200 సిలిండర్లు డెలివరీ చేస్తుండగా సిలిండర్ కు 50 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు. రోజుకు ఇలా అధికంగా వసూలు చేస్తున్న సొమ్ము 10000 రూపాయలు నెలకు మూడు లక్షల రూపాయలు సంవత్సరానికి 38 లక్షల రూపాయలు ఈ డబ్బులన్నీ ఎవరి చేతికి పోతున్నాయి. డీలర్ కు తెలియకుండా ఇంత వ్యవహారం జరగదు బయట ప్రపంచానికి ఈ విషయం తెలియడం లేదంటే వీరు లంచం ఇస్తున్నారని అర్థము. అందుకనే ఎవరు పట్టించుకోవడం లేదు. విలేకరులకు ఫ్రీ గా ఇస్తున్నాడా గ్యాస్ మీకు తెలియడం లేదా అలాగే స్థానిక MRO , MPDO కలెక్టర్ ఆఫీస్ సిబ్బందికి గ్యాస్ ఉచితంగా ఇస్తు ఇతర బహుమతులు ఇస్తున్నారేమో అని వినియోగదారుల అనుమానం. ఇలా ఉండగా 150 రూపాయల పైపును 200 రూపాయలకు అమ్ముతూ పైపుకు బిల్లు కూడా ఇవ్వడం లేదు అడిగివారిని బిల్లు లేదు ఏమీ లేదు అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. పైగా పైపు తీసుకుంటూనే కేవైసీ చేస్తాము లేకపోతే లేదు అని గ్యాస్ సిబ్బంది బెదిరిస్తున్నారు అంటూ వాపోతున్నారు వినియోగదారులు