యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే శివసేన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ముట్టడిలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్, హుజురాబాద్ నియోజకవర్గం కార్యనిర్వాహక అధ్యక్షులు మహమ్మద్ సజ్జాద్ కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్ ముట్టడి సందర్భముగా యూత్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, NEET పరీక్ష పత్ర లీకేజీ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై, 24 లక్షల పైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న బిజెపి ప్రభుత్వంపై గళమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దుచేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఊహించని రీతిలో తీర్పు ఇచ్చారని వారు పాలిస్తున్న ప్రాంతాల్లోనే ఎదురుదెబ్బ తిన్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తును పాడు చేయవద్దని గుడులు గోపురాలపై ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థ పై గాని వైద్య విద్య విద్యార్థుల ఏ ఇతర విషయాలపై లేదని ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పులు తెచ్చి ప్రజలకు విద్యార్థులకు యువతకు అనువుగా మీ పరిపాలన ఉండాలని యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.