Thursday, October 22, 2026
spot_img
HomeUncategorizedరోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన యువ రైతు ఇర్రి రాజశేఖర్ రెడ్డి (38) రాగట్ల పల్లి లో కల్లు సేవించి ద్విచక్ర వాహానం పై నవంబర్ 5వ తేదీ మంగళవారం రాత్రి పదిర గ్రామానికి వెళుతూ అదుపు తప్పి రాగట్లపల్లి పదిర గ్రామాల మద్య సిరిసిల్ల కామారెడ్డి ప్రదాన రహాదారి పక్కన ఉన్న చెట్టుకు డీకొని పొలంలో పడిపోయి గాయపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనలో అయన తలకు బలమైన గాయాలు తగిలి మంగళవారం రాత్రంతా చలిలో గాయపడి పడిపోయి ఉన్నాడు కుటుంబ సభ్యులంతా ఆయన ఆచూకీ కోసం రాత్రంతా వెతికారు. అయినా ఆయన ఆచూకీ వారికి దొరకలేదు మరుసటి రోజు బుధవారం నవంబర్ 6 వ తేదీ తెల్లవారుజామున ఆయన కోసం గాలిస్తుండగా గాయపడ్డ స్థలంలోనే రాజశేఖర్ రెడ్డి తలకు గాయలై బ్లడ్ క్లాట్ అయ్యి స్పృహ కోల్పో పోయి పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

ఆసుపత్రిలో డాక్టర్ల బృందం 15 రోజులుగా చికిత్స చేసిన రాజశేఖర్ రెడ్డి కోలుకోలేదు. ఇక్కడి డాక్టర్ల సలహా మేరకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మంగళవారం నవంబర్ 19 వ తేదీ తెల్లవారుజామున చికిత్స కోసం ఆయనను తరలించారు. చికిత్స పొందుతూ రాజశేఖర్ రెడ్డి బుధవారం తేదీ 20 నవంబర్ తెల్లవారుజామున మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్తులు తెలిపారు. అతనికి భార్య శ్రీజా కుమారుడు విహాన్ రెడ్డి కూతురు నిహారిక తల్లి దేవవ్వ లున్నారు కన్న కొడుకు తన కళ్ళ ఎదుట కన్నుమూయడంతో కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన భర్త మృతి చెందడంతోఅతని భార్య శ్రీజా కన్నీటి పర్యంతమైంది. తన పిల్లలు మరణ వార్త విని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శోకసముద్రమయ్యారు. దీంతో పదిర గ్రామంలో విషాదము చోటు చేసుకుంది. మృతదేహన్ని బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పధిర గ్రామానికి రాత్రి తరలిస్తారు. గురువారం మధ్యాహ్నంలోగా అంతక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments