గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీసున్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని అధికారులకు తెలియజేశారు. అనంతరం హెలిపాడ్ మరియు బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ ను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందికి భద్రత చర్యల్లో ఎటువంటి లోపాలు లేకుండా విధులు నిర్వహించాలని సూచనలు చేశారు.
రేపు జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున కొమరం భీమ్ చౌక్ నుండి జన్కాపూర్ చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున నేషనల్ హైవే రోడ్డును వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను మరియు బస్సులలో వచ్చే ప్రజలు కూడా నేషనల్ హైవే ( బైపాస్) రోడ్డు గుండా బస్టాండ్ కు వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు బైక్లు, కార్లు, ఆటోలకు పార్కింగ్ వాంకిడి మరియు అదిలాబాద్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే వాహనాలకు తాటీయ గార్డెన్ (3 వీలర్ మరియు ఫోర్ వీలర్ ), జూనియర్ కాలేజ్ నియర్ రామాలయం( 2 వీలర్ ) కాగజ్నగర్ ఎక్స్ రోడ్ , రెబ్బెన నుంచి వచ్చే వాహనాలకు జూబ్లీ మార్కెట్ ఏరియా, తిర్యాని , చిర్రకుంట నుంచి వచ్చే వాహనాలు మార్కెట్ యాడ్ నందు విఐపి పాస్ గల వాహనాలకు ప్రేమలా గార్డెన్ ఎదురుగా, సభకు వచ్చే పెద్ద వాహనాలకు (బస్ మరియు డిసిఎం) హైవే మీదుగా తాటియా గార్డెన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ డి.ఎస్.పి సదయ్య, కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
