కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబును జైనురు వద్ద అడ్డుకున్న పోలీసులు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించాల్సిన కనీస బాధ్యత తమపై ఉన్నదని,వారిని పరామర్శించకుండా అడ్డుకోవడం దారుణమని తెలిపారు.బాధితులకు వైద్య, న్యాయ సహాయం అందించాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జైనూరు వెళ్లిన డా.హరీష్ బాబు వెంట భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, భజరంగ్దళ్ జిల్లా అధ్యక్షులు శివ గౌడ్, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ తదితరులు ఉన్నారు.