రాష్ట్రంలో విద్యార్థులు పిట్టాల్లా రాలిపోతున్న స్పందించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సిగ్గుచేటు అన్నారు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. నిర్మల్ జిల్లా మైనారిటీ గురుకులంలో నిన్న రాత్రి పదవి తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడడంతో అర్బజ్ అనే విద్యార్థి మరణించాడని దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ఇద్దరు విద్యార్థులు కొట్టుకుంటే డ్యూటీలో ఉన్న టీచర్స్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని, ప్రిన్సిపాల్ వార్డెన్ లను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్ది అర్బజ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎక్సగ్రెసియ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రములో హాస్టల్స్ గురుకులాలు కేజీబీవీ లో జరుగుతున్న సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
రాష్ట్రములో హాస్టల్స్ జైలు కన్నా, బర్ల కొట్టాల కన్నా హీనంగా దుర్భర పరిస్థితిలో విద్యార్థులు ఉంటున్నారని, వసతి గృహాల్లో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని దీనిపై ప్రభుత్యం ఎందుకు స్పందించడం లేదని, ప్రభుత్యం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్న విద్యా శాఖకు మంత్రి లేరంటే ప్రభుత్వనికి విద్యా వ్యవస్థపైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని ఘాటుగా విమర్శించారు. రోడ్ మీద ఫుడ్ స్టాల్ తొలగిస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మరణిస్తే ఇంతవరకు ఎందుకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ములో హాస్టల్స్ గురుకులలు కేజీబీవీ లో సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని లేకుంటే తీవ్ర ఉద్యమాలు చేస్తామని ప్రభుత్యం ఇకనైనా స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ABVP తరుపున హెచ్చరిస్తున్నాము అన్నారు. కార్యక్రమంలో SFS కన్వీనర్ చంద్రగిరి శివ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రఘు, దినేష్, సత్య జై, శాషంక్, వంశీ, తదితరులు పాల్గొన్నారు