మాఘ అమావాస్య సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 9న మాఘ అమావాస్య జాతర ఉన్నందున ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 400 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయ జాతరలో ఎల్లారెడ్డిపేట మండలంతో పాటు పరిసర మండలాల ప్రజలు కూడా పాల్గొనాలని ఆలయ కమిటీ పేర్కొంది. మాఘ అమావాస్య సందర్భంగాఎక్కడైనా ఆంజనేయస్వామి ఆలయాలలో పూజలు జరుగుతాయి కానీ ఎల్లారెడ్డిపేటలో ఉన్న శ్రీ లక్ష్మి కేశవ పెరమాండ్ల స్వామి వార్లకు ఉదయం నుండి అభిషేకాలు, అర్చన, కలశ పూజలు చేయడం ప్రత్యేకత.
కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పారిపెళ్లి రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, సహాయ కార్యదర్శి వడ్నాల నారాయణ, కోశాధికారి గంప నరేష్, రైటర్ గుండాడి వెంకటరెడ్డి, కమిటీ సభ్యులు తెలిపారు.