Wednesday, November 6, 2024
spot_img
HomeTELANGANAఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు?

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు?

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కవితను సీబీఐ మరోసారి ప్రశ్నించనుందా!? ఈసారి ఏకంగా ఢిల్లీకే పిలిపించనుందా!? ప్రస్తుతం దర్యాప్తు సంస్థల అడుగులన్నీ ఈ దిశగానే పడుతున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. ఢిల్లీ మద్యం స్కాం కేసులో సీబీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు తమపై పడకుండా ఉండడానికి ఒకరి తర్వాత మరొకరిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేస్తోంది. ముందుగా కీలక వ్యక్తులను కాకుండా, వారి చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేస్తోంది. వారికి సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులను న్యాయస్థానాలకు అందజేస్తోంది. వాటన్నిటిలోనూ కూడా నిందితులతో కలిసి కవిత మద్యం దందా చేశారని పేర్కొంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయిన్‌పల్లి, కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో అభిషేక్‌ బోయినపల్లి కూడా గతంలో కవితకు పీఏగా వ్యవహరించారని, ఆమె వ్యవహారాలు చూసే వారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే, ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఓ సాక్షిగా కల్వకుంట్ల కవితకు 160 సీఆర్‌పీసీ కింద డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే ఏడు గంటలకుపైగా విచారించింది.

కేసు దర్యాప్తునకు సంబంధించి వారికి కావాల్సిన సమాచారం సేకరించింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పినా.. ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ఆ తర్వాత సీబీఐ మరింత దూకుడు పెంచింది. అరబిందో శరత్‌ చంద్రారెడ్డిని ప్రశ్నించి ఆయనను అరెస్టు చేసింది. గత వారంలోనే కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఢిల్లీకి విచారణకు పిలిచి తర్వాత అరెస్టు చేశారు. తాజాగా, ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌ రెడ్డిని శుక్రవారం ఈడీ అరెస్టు చేసింది. మద్యం వ్యాపారంలో ఉన్న తమకు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో సంబంధం లేదని ఎంపీ మాగుంట ప్రకటించినా పక్కా ఆధారాలతో ఆయన కుమారుడిని ఈడీ అరెస్టు చేసింది. రాఘవ్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన ఈడీ.. అందులో కవిత పేరునూ ప్రస్తావించింది. మరోవైపు లిక్కర్‌ స్కాంపై గతంలో దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే కవిత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో కవితకు త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈసారి నోటీసులు జారీ చేసి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు చెబుతున్నాయి. గతంలో ఇచ్చిన సమాచారం, ఆ తర్వాత జరిగిన అరెస్టులు, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు కవితను ప్రశ్నించనున్నట్లు పేర్కొంటున్నాయి. విచారణ అనంతర పరిణామాల నేపథ్యంలో.. తదుపరి చర్యల్లో భాగంగా కవితను సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. లిక్కర్‌ స్కాం కేసులో వరుస పరిణామాలు కవితకు ఇబ్బందికరంగా మారాయని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆదివారం శాసన మండలిలో కవితను ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్‌ కలిశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ ఆందోళనతో కనిపించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments