హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. ఆ షోని నుంచి బయటికి వచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులను ధరించి ఆ ఫోటోలను వీడియోలని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే వాటి వల్ల ఎక్కువసార్లు విమర్శల పాలవుతూ ఉంటుంది. కొంతమందైతే ఉర్ఫీని చంపేస్తామని బెదిరించారు. తాజాగా ఓ బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు చిత్ర వాగ్ తాజాగా ఈ భామపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు.
బహిరంగంగా నగ్నత్వాన్ని ఉర్ఫీ ప్రచారం చేస్తోందని అందులో చిత్ర వాగ్ పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఉర్ఫీ జావేద్ స్పందించింది. ‘రాజకీయవేత్తలపై వ్యతిరేకంగా మాట్లాడడం చాలా ప్రమాదకరమని నాకు తెలుసు. కానీ ఈ వ్యక్తులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవచ్చు లేదా నా మనసులో మాట చెప్పి వారి చేతుల్లో చస్తాను. కానీ మళ్లీ హాయ్, నేను దీన్ని ప్రారంభించలేదు. నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఎలాంటి కారణం లేకుండానే నాపైకి వస్తున్నారు’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.