హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకే చితికి నిప్పు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ పేదింటి ఆడబిడ్డ తన కన్న తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకున్న ఘటన బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన భల్ల సత్తవ్వ (85 ) అనే నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె పెద్ద బిడ్డ ఇప్పలపల్లి ప్రభావతి అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కొడుకు లేని రుణాన్ని తీర్చుకున్న బిడ్డ ప్రభావతి ని చూసి పద్మశాలి సేవా సంఘం వారు, గ్రామస్తులు అభినందించారు.