భూమి రిజిస్ట్రేషన్ విషయంలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ తస్లీమా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా చిక్కారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో సాయంత్రం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, రాజు, సునిల్ తో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. దాట్ల గ్రామానికి చెందిన గుండెగాని హరీష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా వెంకట్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం వరంగల్లోని ఏసీబీ కోర్టులో ప్రోడ్యూస్ చేయనున్నట్లు తెలిపారు.