ముస్తాబాద్ మండల కేంద్రంలో దోస్తీ మీట్ జిల్లాస్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీల్లో భాగంగా ముస్తాబాద్ మండల క్రీడాకారులకు ఎస్సై శేఖర్ వాలీబాల్ కిట్లు అందించారు. జిల్లా స్థాయిలో 12 తారీకున జరగబోయే ఫైనల్ మ్యాచ్ల క్రీడల్లో పాల్గొని మన ముస్తాబాద్ కు మొదటి బహుమతి ద్వితీయ బహుమతి మరియు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గజ్జలరాజు, ఎక్స్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కొండం రాజిరెడ్డి, వుచ్చిడి బాల్రెడ్డి, కోల కృష్ణ, మిరుదొడ్డి భాను, రంజాన్ నరేష్, కానిస్టేబుల్ రాజశేఖర్, కుమార్ మండల యువత క్రీడాకారులు పాల్గొన్నారు.