మహబూబాబాద్ కలెక్టరేట్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ శిబిరం గురువారం డిపిఓ హరి ప్రసాద్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ సభల యొక్క సామర్ధ్యాన్ని పెంచుటకు, గ్రామ సభలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించి, ప్రత్యేకించి మహిళా గ్రామసభలు నిర్వహించడం, గ్రామాలలో పారదర్శక పాలన అందించటానికి, సమాచార హక్కు చట్టం ప్రజా ఫిర్యాదులు ప్రజలకు సులభంగా సమాచారం అందించే విధంగా తీసుకోవలసిన అంశాలపై, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 యొక్క ప్రధాన అంశాల మీద, మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీ, పిల్లల స్నేహ పూర్వక పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి గ్రామంలో చేపట్టవలసిన కార్యక్రమాలు, అంశాలు, ప్రణాళికలపై ప్రధానంగా ఈ శిక్షణ నిర్వహించారు.
గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలు, పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలు, ప్రజా ప్రతినిధులకు గ్రామ ప్రజలకు మరియు గ్రామంలో పనిచేస్తున్న గ్రామస్థాయి ఉద్యోగులకు ఒక సమాచార భాగస్వామిగా వ్యవహరించుటకు పంచాయతీ కార్యదర్శుల యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలని విషయాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో శిక్షణ పొందిన మీర్జా మునవర్ బేగ్, మండల పంచాయతీ అధికారి డోర్నకల్ మరియు డి మురహరి రావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (రిటైర్డ్), మధిర పంచాయతీ కార్యదర్శులు రెండు రోజుల ట్రైనింగ్ కార్యక్రమానికి శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు.


