మనం తోడుగా నిలబడదాం ఆదుకుందాం.. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
వేములవాడ పట్టణంలో చాలాకాలం నుండి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. గత రెండు మూడు సంవత్సరాల నుండి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చివరికి ఈరోజు ఉదయం ఉప్పుల పుష్ప(50) సంవత్సరాలు. ఈరోజు ఉదయం 8గంటలకు తుది శ్వాస విడిచింది వీరికి స్వంత ఇల్లు కూడా లేక కిరాయి ఉన్న ఇంటి ముందు వాకిట్లో పార్థివ దేహాన్ని ఉంచారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని మృతురాలి భర్త దేవయ్య కోరడంతో ట్రస్టు గ్రూపులలో, ఇతర గ్రూపులలో మరియూ సోషల్ మీడియా ద్వారా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున కోరుతూ మానవతా దృక్పథంతో విరాళాలు అందించే దాతలు ట్రస్టు ఫోన్ పే నం. 89855 88060కు అందించాలని కోరుతున్నాము.