Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAఆలయ భూమికి నీటి వసతి కల్పించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వినతి

ఆలయ భూమికి నీటి వసతి కల్పించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో గల శ్రీ వేణు గోపాల స్వామి ఆలయంకు సంబంధించి ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్ గ్రామ శివారులో ఆలయంకు సంబంధించి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఇట్టి భూమిలో బోర్ వేసి నీటి వసతి కల్పించడం ద్వారా ఆలయంకు యాసంగి, వానాకాలం పంటల కోసం బోర్ వేయించడం ద్వారా అలయంకు ప్రతి ఆరు నెలలకోసారి ఆదాయం వస్తుందని ఇట్టి ఆదాయం ద్వారా ప్రతి ఏటా జరిగే రథోత్సవానికి ఇట్టి ఆదాయం వినియోగించుకోవచ్చని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఆలయ కమిటీ సభ్యులు వివరించి దేవాదాయ శాఖ నుండి ఆలయ పునర్ నిర్మాణం కోసం రావాల్సిన నిధులు కూడా ఇప్పించాలని కోరగా ఎన్నికల కోడ్ అనంతరం నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన వారిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్, ఆలయ కమిటీ సలహాదారు బుచ్చి లింగు, సంతోష్ గౌడ్ లున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments