పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో సీనియర్ నాయకుడు గుర్నులే నారాయణ, యువ నాయకుడు దుర్గం ప్రశాంత్ కాంగ్రెస్ ప్రచారం దూకుడు పెంచారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరిలో నిలిచిన ఆత్రం సుగుణక్క గెలుపే ధ్యేయంగా దొడ్డి గూడ, కొలంగూడ, యేనాగొంది, చిచ్చుపల్లి, రాంనగర్, నావేదరి గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షులు గుర్నులే నారాయణ, యువ నాయకుడు దుర్గం ప్రశాంత్. ఈ కార్యక్రమంలో వాంకిడి మండల యూత్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ , ఉప్రే అశోక్, వాడై పోశెట్టి, రమేష్, పండు, పొచ్చు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ రోజులు దగ్గర పడుతుండటంలో మండలం నాయకులు నారాయణ, దుర్గం ప్రశాంత్ లు గ్రామాల్లో విస్తృతంగా సుడిగాలి ప్రచారం పర్యటనలు చేస్తున్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు గుర్నులే నారాయణ, విశ్వ ప్రసాద్ రావు,ఆత్రం సుగుణక్క, సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీ రాహూల్ గాంధీ సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సుగుణక్క గెలుపు దిశగా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.