Sunday, November 3, 2024
spot_img
HomeTELANGANAకాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల క్లారిటీ

కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల క్లారిటీ

 కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి చెక్ పెట్టారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఈరోజు (మంగళవారం) లోటస్‌ పాండ్‌లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు అధినేత్రి. ఈనెల 4న కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమని షర్మిల స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు అధినేత్రి చెప్పారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లైంది.

మరోవైపు ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి షర్మిలకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఢిల్లీకి రావాలని షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి పిలుపు వెళ్లింది. 4న ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆ సమయంలోనే వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షర్మిలకు ఏఐసీసీ పదవి ఇస్తారా? ఏపీ పీసీసీ పదవి ఇస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి వైపే రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిలకు ఏ పదవి రాబోతుంది అనే జనవరి 4 వరకు వేచి చూడాల్సిందే..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments