హైదరాబాద్/బోయినపల్లి: ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూబోయినపల్లి, ఆనంద్‌నగర్ కాలనీలో నివాసముంటున్న అబ్దుల్ బారిక్ కుమారుడు అబ్దుల్ ఖాదిర్(24) 2019లో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చూపు సరిగా కనిపించకపోవడంతో ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఖాదిర్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో యాసిడ్ తాగాడు. తర్వాత తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఖాదిర్‌ను తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు బోయినపల్లి ఎస్‌ఐ యుగేందర్ తెలిపారు.