Monday, May 20, 2024
spot_img
HomeCINEMAఈ నటుడు కూడా హ్యాపీ!

ఈ నటుడు కూడా హ్యాపీ!

సుడిగాలి సుధీర్‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమాతో సుధీర్ ఎంత హ్యాపీగా ఉన్నాడో.. తను కూడా అంతే హ్యాపీగా ఉన్నానని అంటున్నారు.. సినిమాలో హీరోయిన్ ఫాదర్‌గా నటించిన రవిరెడ్డి. ‘‘ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాఫ్ట్‌వేర్ సుధీర్’’ మొదలగు చిత్రాలలో నటించిన రవిరెడ్డి ‘గాలోడు’లో చేసిన ఫుల్ లెంగ్త్ రోల్ పాత్ర.. తనని గాల్లో విహరించేలా చేస్తున్నదని అంటున్నారు.

అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ చేయడంతోపాటు ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, అక్కడ మోడలింగ్ సైతం చేసిన రవిరెడ్డి ఇప్పుడు టాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా ఒకే ఒక్క సినిమా కెరీర్‌ను మార్చేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అలాంటి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు ‘గాలోడు’ రూపంలో ఓ ఘన విజయం లభించిందని ఈ అమెరికా రిటర్నడ్ బిజినెస్‌మ్యాన్. ‘గాలోడు’ చిత్రంలో హీరోయిన్ ఫాదర్‌ గా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి స్టైలిష్ అండ్ హ్యండ్సమ్ ఫాదర్ రోల్‌తో తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రవిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments