సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో గల మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ బుదవారం పరిశీలించారు. ఇటీవల సింగ సముద్రంలో నీటిమట్టంను పరిశీలించగా 15 ఫీట్లు వరకే నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశకు ఉండగా పంటలు పూర్తి స్థాయిలో పండే అవకాశం లేదు. దీంతో ఎల్లారెడ్డి పేట, బోప్పపూర్, కోరుట్లపేట, సర్వాయిపల్లె, నారాయణ పూర్ గ్రామాల ఆయకట్టులో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎగువ మానేర్ కు అక్కడి నుండి సింగ సముద్రంకు నీటిని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ గౌతమి కి వినతి పత్రం అందజేశారు. కాగ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో కూడా చాలా మేరకు నీటి మట్టం తగ్గిందని పంటలు ఎలా చేతికి అందుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు బోర్ మోటార్ లను సైతం స్టార్ట్ చేసుకోవాలని ఒగ్గు బాలరాజు యాదవ్ రైతులను కోరారు. వరుస తడులు తప్పేట్టు లేదు సింగ సముద్రం ఆయకట్టు నుండి వచ్చే సాగునీటి తో పంటలు పూర్తిగా పండే పరిస్థితి లేదని రైతులు వరుస తడుల ద్వారా పంటలు చేతికి అందేలా చూసుకోవాలని రైతులను కోరారు. ఆయన వెంట జీడి రాజు యాదవ్, అందే శేఖర్, రాజు తదితరులు ఉన్నారు