ఎల్లారెడ్డిపేట వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య కుల గురు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామిజి వైశ్య గురు మఠం హల్దిపూర్ వారి అదృష్టం మేరకు కోటి పుష్పార్చనలో భాగంగా లక్ష పుష్పార్చన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండ చిన్న మల్లేశం గుప్తా, బొమ్మ కంటి రాజేశం గుప్తా, బచ్చు అశోక్ గుప్తా, గంప నాగేందర్ గుప్తా, బొమ్మ కంటి భాస్కర్ గుప్తా, చకిలం మధు గుప్తా, రేవూరి లక్ష్మీనారాయణ గుప్తా, బచ్చు శ్రీను గుప్తా, చింత రాజు గుప్తా, బొమ్మ కంటి రాజయ్య గుప్తా, తాటిపెల్లి సుధాకర్ గుప్తా వైశ్య కుల బాంధవులు పాల్గొన్నారు.