కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గురువారం రాత్రి 9గంటల నుంచి చికిలి వాగు నుంచి JCB తో ఇసుకను ట్రాక్టర్ లో అక్రమ రవాణా చేస్తున్నారు. పగటి పూట అధికారులు పట్టుకుంటారని రాత్రీ పూట ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చికిలీవాగు పరిసర ప్రాంతాల గ్రామాలకు తాగు, సాగు నీరు పుష్కంగా అందుతుంది. వాగులో సమృద్ధిగా ఇసుక ఉండడంతో వాంకిడి మండలానికి చెందిన బడా వ్యాపారులు, అక్రమార్కులు అనుమతి లేకుండా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి జెసిబితో ఇసుక ట్రాక్టర్లను నింపి సరఫరా చేస్తున్నారు. అధికారికంగా పర్మిషన్లు ఉన్న రాత్రివేళలో జెసిబి తో ఇసుక నింపడం వెనకాల అధికారుల హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ తతంగం ప్రతిరోజు వాంకిడి మండలం, చికలి వాగులో కొనసాగుతుంది.