ప్రాణాపాయాలను రాపిడి చేయడమే యోగమని యోగ సాధన ద్వారా బాహ్య కర్మల నుంచీ విముక్తి పొందగలమని శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి శ్రీ స్వామి అంతర్ముఖానంద గురూజీ అన్నారు. ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురూజీ 74వ జయంతి జరిగింది. శ్రీ గురూజీ జన్మదిన ఉత్సవంకు జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ శిష్యులు దాదాపు 200 మంది వచ్చారు. సద్గురు పూజ అనంతరం ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురూజీ ఆశ్రమానికి వచ్చిన శిష్యులకు ఆధ్యాత్మిన భాషణం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా అనర్గళంగా, అలవోకగా శ్రీ గురూజీ నోటి వెంట పరమపదసోపానాలు వెలువడ్డాయి. “యోగం-జ్ఞానం-బ్రహ్మం” ఈ మూడు ఉపదేశం పొందిన ప్రతీ సాధకునికి అత్యంత ఆవశ్యకమని అన్నారు. పొందని ఉనపదేశంతో సాధన ద్వారా “అంతా నేనే” అన్న అహం పోయి సర్వం కల్విదం బ్రహ్మ అన్న స్థాయికి జీవుడు చేరుతాడని శ్రీ గురూజీ అన్నారు. ఈ ఉత్సవానికి శివ దంపతులు, జగ్గారావు దంపతులు, రామకృష్ణ దంపతులు, డా. సుబ్రహ్మణ్యం దంపతులు, డా హరగోపాల్ దంపతులతో పాటు కేంబూరి సూర్యనారాయణ, విజయగోపాల్, రాము, లక్ష్మణ్ రావు, లక్ష్మణ్, శరత్ లతో పాటు పెద్ద ఎత్తున శిష్యులు పాల్గొన్నారు.