ఇటీవలే రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కందుల దుర్గేష్ ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి), జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు,శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ సభ్యుడు కరణం సుబ్రహ్మణ్యం, ఏలేశ్వరం సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ, ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షులు పలివేల వెంకటేష్, బద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు ఎజ్జు వీరబాబు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి కందుల దుర్గేష్ కి పూలమాల వేసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాడు నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావడానికి మీ కృషి మరువలేనదని, మీ అందరికీ తాను ఎప్పుడు మునుపటిలాగే అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
మంత్రి కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు
RELATED ARTICLES