NSUI మాజీ కరీంనగర్ జిల్లా కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలందరికి స్వీట్స్ మరియు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు రాజకీయాల్లో ముందు చూపు కలిగిన ఒక గొప్ప నాయకుడిగా, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతూ ప్రజా సేవే లక్ష్యంగా తన తండ్రి, మనందరి ప్రియతమ నేత, అజాత శత్రువు, మంథని ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన వారసుడిగా ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తు, నిస్వార్ధంతో ప్రజలకు సేవ చేసే జన నేత తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మన్ దేశిని స్వప్న కోటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపని, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఎర్రం సతీష్ రెడ్డి, బొంగోని వీరన్న, ముద్దమళ్ళ రవి, ఎండీ సలీం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండీ సజ్జద్, NSUI జమ్మికుంట మండల అధ్యక్షులు వాసల సుదీర్, పాతకాల అనిల్, మాధవ్ రావు,సల్మాన్, రమేష్, ఫర్వేజ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు…