రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య అనే వ్యక్తి మృతికి కారణం అయిన రంగు నాగరాజు అనే వ్యక్తికి సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత 05 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య ఇంటి వద్ద అదే గ్రామానికి చెందిన రంగు నాగరాజు తేదీ 27 జులై 2020 రోజున పెంపుడు కుక్క, అంజయ్య ఇంటి ముందట మూత్ర విసర్జన చేయడంతో బొమ్మెర అంజయ్య అభ్యoతరం వ్యక్తం చేయగా ఇరువురి మధ్య గొడవ జరిగి దీంతో అగ్రహించిన నాగరాజు అంజయ్యపై దాడి చేయగా స్ఫహ కోల్పోయాడు. అప్పటికే గుండె జబ్బుతో బాధ పడుతున్న అంజయ్యని దవాఖానకి తరలిస్తుండగా దారిమధ్యలో చనిపోయాడు. దీంతో అంజయ్య కుమారుడు భీంచంద్ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ. వెంకటకృష్ణ కేసు నమోదు చేసి, అప్పటి సీ.ఐ బన్సిలాల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించగా అప్పటి, ప్రస్తుత CMS లు శ్రీకాంత్, రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, CMS కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 13 మంది సాక్షులను ప్రవేశ పెట్టారు. పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రంగు నాగరాజుకు 05 సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ తెలిపారు.